ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
జీవితంలో ఈ ఏడు విషయాలను పాటించండి – మీ ఎదుగుదలను ఎవరు ఆపలేరు.
ఆరోగ్యాన్ని పెంచుకోవడం. కేవలం రోజుకి గంట సమయం కేటాయిస్తే చాలు సాధారణ నడక, యోగ, ప్రాణాయామ ఏమాత్రం ఖర్చు లేనివి. మీ శరీరాన్ని మీరే జాగ్రత్త తీసుకోకుండా ప్రేమించలేకపోతే అవతలివారు మీ గురించి ఎందుకు ఆలోచిస్తారు.
టైం ఖచ్చితంగా అనుసరించేలా చూసుకోండి. 10 గంటలకు అప్పాయింట్మెంట్ ఉంటె 9.45 కి మీరు అక్కడికి చేరుకొండి.
మీ బాడీ లాంగ్వేజ్ ని ఎప్పుడు హుందాగా ఉంచుకోండి. అతి గాంభీర్యం, అతి లేకితనం రెండూ ఇబ్బందులే. మొదట అవతల వారు చెప్పింది విని తరువాత మీరు చెప్పడం మొదలుపెట్టండి. ఎక్కువ సంక్లిష్టత లేకుండా అర్ధవంతంగా మాట్లాడండి.
మీ వ్యాపారం లో నిజాయితీగా ఉండండి. మీరు ఏది చెయ్యగలరో ఆ పనిని మాత్రమె స్వీకరించండి. బాట్ మాన్ రిటర్న్స్ లో జోకర్ చెప్పినట్లు “తెలియని పని చెయ్యకూడదు, తెలిసినది ఫ్రీ గా చెయ్యకూడదు”. చేసే పనికి ఖచ్చితంగా ఎంత ధర అవుతుందో అంత వసూలు చెయ్యండి. తక్కువ ఖర్చుకి పని మొదలు పెట్టి తరువాత నష్టాల్లో ఇరుక్కోవద్దు.
చేసే పనిని 100% ఇష్టపడి చెయ్యండి. వేరే పని గురంచి అలోచించి ఈ పనిని కూడా పాడుచెయ్యోద్దు.
మీ కన్నా మీ వ్యాపారంలో స్థిరపడినవారినుండి ఎప్పుడూ సలహాలు, సూచనలు తీసుకోండి. మీ తరానికి వారి తరానికి ఉన్న తేడా గమనించి కొత్త విషయాలను అందులో ప్రవేసపెట్టండి .
మీ తోటివారితో పోటీ పడoడి. అది హుందాగా, న్యాయంగా ఉండాలి. వారికీ మీకు ఉన్న తేడ గ్రహించి వారినుండి మీరు తెలుసుకావలసినవి తెలుసుకొని, చెప్పవలసినవి చెప్పండి.