మత్తు వదలరా 2 రివ్యూ – Mathu Vadalara 2 Review
ఫస్ట్ పార్ట్‌లో డెలివరీ బాయ్స్‌గా ఉన్న బాబు మోహన్, ఏసుదాస్‌లను సెకండ్ పార్ట్‌లో HE ఏజెంట్‌లుగా మార్చాడు దర్శకుడు. HE (Heavy Emergency) అనే కాన్సెప్ట్ చాలా కొత్తగా అనిపిస్తుంది. లాజిక్‌లు లాగితే ఇదెక్కడికి హీ రా బాబూ అనుకోవచ్చు కానీ.. కథలో మాత్రం హి అనేది ఇబ్బందిగా కాకుండా ఇన్వాల్వ్ అయ్యేట్టుగా మలిచారు.
బాబు మోహన్ (శ్రీ సింహా), ఏసుదాస్ (సత్య), నిధి (ఫరియా అబ్దుల్లా)లు HE ఆపరేషన్స్‌లో ఏంజెంట్‌లుగా పనిచేస్తుంటారు. అయితే బాబు మోహన్, ఏసుదాస్‌లు కిడ్నాప్, మర్డర్ కేసులను ఛేదిస్తూ ఉంటారు. ఆ కేసుల్లో దొరికిన డబ్బుల్లో కొంత భాగాన్ని ‘తస్కరిస్తూ’ ఉంటారు.
అలా ఓ కేసులో ఒకేసారి రెండు కోట్లు తస్కరిస్తే లైఫ్ సెటిల్ అని అనుకుంటారు. అలా తస్కరించే ప్రాసెస్‌లో దామిని (యంకర్ ఝాన్సీ) కూతురు రియా మర్డర్ కేసులో ఇరుక్కుంటారు. ఆ మర్డర్ మిస్టరీ నుంచి ఎలా బయటపడ్డారు? అసలు ఆ హత్య చేసిందెవరు? ఆ మర్డర్ మిస్టరీ బాబు మోహన్ ఎలా ఛేదించాడు? అసలు హంతకులకు ఎలా పట్టుకున్నాడు అన్నదే ‘మత్తు వదలరా 2’ మిగిలిన కథ
బాబూ మోహన్, ఏసుదాస్‌లు క్రైమ్‌లో ఇరుక్కోవడం.. దాన్ని నుంచి బయటకు రావడానికి చక్కని బేస్ పాయింట్‌తో ఎంగేజింగ్ కథను అల్లారు దర్శకుడు రితేష్ రానా. తాను చెప్పాలనుకున్న కథకి అనవసరమైన హంగామాలకు పోకుండా.. పది పన్నెండు క్యారెక్టర్స్‌తో మూడు నాలుగు లొకేషన్స్‌లో సింప్లీ సూపర్బ్ అనిపించారు దర్శకుడు.
మత్తు వదలరా ఫస్ట్ పార్ట్‌కి కథే ఆయువుపట్టు అయితే.. కామెడీ అదనపు బలం అయ్యింది. ఈ రెండో పార్ట్‌కి ఈ కామెడీనే కొండంత బలం అయ్యింది. ఇలాంటి సరికొత్త హుడ్ జానర్ ఫిల్మ్‌లో కామెడీని ఇరికించడం అంటే.. ఆయుధం లేకుండా యుద్ధానికి వెళ్లడమే కానీ.. కామెడీ అనే అస్త్రంతో నవ్వుల సవారీ చేయించారు.
ఏదైనా సినిమా బాగుంటే.. ఎక్కువగా హీరో గురించో.. హీరోయిన్ గురించో.. తప్పితే దర్శకుడి గురించో మాట్లాడుకుంటారు. కానీ.. ‘మత్తువదలరా 2’ చిత్రం విషయంలో మాత్రం.. కమెడియన్ సత్య గురించే ఎక్కువ మాట్లాడుకుంటారు. ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీలో ఫన్‌కి స్పేస్ చాలా తక్కువ ఉంటుంది. కానీ.. ఫన్ రైడ్‌తో పొట్ట చెక్కలు చేశాడు కమెడియన్ సత్య.
ఈ సినిమాకి హీరో శ్రీ సింహానే అయినా.. హీరోకంటే ఎక్కువ మార్కులు సత్యకే వేయొచ్చు. అంతలా నవ్వించాడు సత్య. కమెడియన్ అంటే ఏదో నాలుగు జోక్‌లు వేయడం.. ఒక ట్రాక్‌తో కథలో భాగం కావడం అన్న జోనర్ నుంచి.. కథానాయకుడితో సరి సమానంగా కమెడియన్ సత్యకి మంచి స్కోప్ లభించింది.
పదహారేళ్ల వయసు పాటకి సత్య వేసిన స్టెప్‌లకు థియేటర్స్‌లో రీ సౌండ్ మామూలుగా లేదు. కామెడీ.. ఫైట్స్.. యాక్షన్.. సాంగ్స్.. ఇలా ఒక్కటి కాదు.. తన కామెడీ టైమింగ్‌తో మత్తు వదిలించేశాడు.
శ్రీసింహా.. బాబు మోహన్ పాత్రలో ఒదిగిపోయాడు. ముఖ్యంగా శ్రీసింహా, సత్య కాంబినేషన్ సీన్‌లకు పడి పడినవ్వుకోవచ్చు. వీళ్లిద్దరి కాంబోకి ముందు ముందు ఇంకా మంచి క్రేజ్ ఏర్పడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
హీరోయిన్ అంటే.. నాలుగైదు పాటలు.. ఒకటి రెండు సీన్లు.. ఇదే మన టాలీవుడ్ ట్రెండ్. ఈ ట్రెండ్‌పై సుతిమెత్తని పంచ్‌లు వేస్తూ.. కథలో కథానాయికని ఇన్వాల్ చేసిన తీరుకి దర్శకుడికి ప్రశంసలు దక్కాల్సిందే. ఫరియా అబ్దుల్లా మంచి గ్లామరస్ నటి.. అయితే ఆమెలోనే గ్లామర్‌కి మాత్రమే పదునుపెట్టే పాత్రను కాకుండా..
కథలో భాగం అయ్యే పాత్రను రాశాడు దర్శకుడు. హి టీం మెంబర్‌గా ఫరియా అబ్దుల్లా అదరగొట్టింది. హీరోయిన్ అంటే హీరోతో పాటు.. నాలుగైదు పాటలు, రొమాన్స్ ఇలాంటి రొటీన్ ఫార్మేట్‌లో కాకుండా.. కథానాయికిగా కథలో ఇన్వాల్వ్ అయ్యింది ఫరియా అబ్దుల్లా. అందుకే ఆమెకు ఒక పాటా ఉండదు.. రొమాన్స్ ఉండదు. క్యారెక్టర్‌కి స్కోప్ మాత్రమే ఉంటుంది.
హుడ్ జానర్, డిఫరెంట్ కాన్సెప్ట్ ఫిల్మ్‌కి నేపథ్య సంగీతమే ఆయువుపట్టు.. ఫస్ట్ పార్ట్‌లోనే సినిమా హిట్‌లో ప్రధానమైన భాగం పంచుకున్న ఎస్టాబ్లిష్డ్ సింగర్ కాళ భైరవ.. సంగీత దర్శకుడిగా మరో మెట్టు ఎక్కారు. కాళ భైరవ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకి పెద్ద ప్లస్.
ఓవరాల్‌గా.. మత్తువదలరా పార్ట్ 02 మరో విజయాన్ని తస్కరించేశారు.
Mathu Vadalara 2 movie review
Mathu Vadalara 2 movie rating
Mathu Vadalara 2 review by critics
Mathu Vadalara 2 box office review
Mathu Vadalara 2 movie pros and cons
Mathu Vadalara 2 public talk
Mathu Vadalara 2 public reactions
What is the release date of Mathu Vadalara 2?
Answer: The official release date of Mathu Vadalara 2 has not been confirmed yet. Fans are eagerly waiting for an announcement from the filmmakers.
Who are the lead actors in Mathu Vadalara 2?
Answer: The lead actors of Mathu Vadalara 2 are expected to include the original cast featuring Sri Simha Koduri, along with potential new additions. However, the official cast is yet to be announced.
Is Mathu Vadalara 2 a direct sequel to the first movie?
Answer: Yes, Mathu Vadalara 2 is expected to be a direct sequel, continuing the quirky and thrilling narrative of the first film.
What is the plot of Mathu Vadalara 2?
Answer: While the plot is not fully revealed, Mathu Vadalara 2 is anticipated to carry forward the mix of suspense, humor, and thriller elements that made the first film a success.
Who is the director of Mathu Vadalara 2?
Answer: The director for Mathu Vadalara 2 has not been officially confirmed, but Ritesh Rana, who directed the first part, is rumored to return for the sequel.
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.