ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Business Ideas in Telugu – Vanilla Farming: ప్రస్తుతం మనదేశంలో కిలో వెనీలా విత్తనాల ధర రూ.40 నుంచి 50వేల వరకు పలుకుతున్నాయి. వెనీలాను పెద్ద ఎత్తున సాగు చేస్తే.. రైతులు కోటీశ్వరులవుతారు. అంత బాగా లాభాలు వస్తాయి.
ప్రస్తుతం రైతులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్న పంటల్లో వెనీలా కూడా ఉంది. మనదేశంలో కొన్ని ప్రాంతాల్లో ఎంతో మంది రైతులు వెనీలాను – Vanilla Farming పండిస్తున్నారు. కుంకుమ పువ్వు తర్వాత అత్యంత ఖరీదైన పంటగా వెనీలాయే. మడగాస్కర్, పపువా న్యూగినియా, భారత్, యుగాండా వంటి దేశాల్లో వీటిని ఎక్కువగా సాగు చేస్తున్నారు.
స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా తయారయ్యే ఐస్క్రీమ్లో వెనీలా ఫ్లేవర్ (Vanilla Flavor) వాడకం 40 శాతం వరకు ఉంది. వెనిలా పండు సువాసన అద్భుతంగా ఉంటుంది. దీనిని కేకులు, ఐస్క్రీమ్లు, పర్ఫ్యూమ్స్, ఇతర సౌందర్య ఉత్పత్తుల తయారీలో వినియోగిస్తారు. వెనీలాలో వెనిలిన్ అనే రసాయన మూలకం ఉంటుంది.
ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ని తొలగించడంలో దోహదపడుతుంది. వీటి పండ్లు, విత్తనాలు క్యాన్సర్ వంటి వ్యాధులపై ప్రభావవంతంగా పనిచేస్తాయట. అంతేకాదు పొట్టను శుభ్రం చేయడం, వ్యాధి నిరోధక శక్తి పెంచడం, దగ్గు, జలుబు, జ్వరం వంటి వ్యాధులను దూరం చేయడంలో ఎంతో మేలు చేస్తుంది. అందుకే మార్కెట్లో వెనీలా పండ్లు, విత్తనాలకు మంచి డిమాండ్ ఉంది. తద్వారా అధిక ధర లభిస్తుంది. రైతులకు భారీగా ఆదాయం వస్తోంది.
వెనిలా ఆర్చిడ్స్ ఫ్యామిలీకి చెందిన మొక్క. వెనిలా సాగుకు గోధుమ రంగు నేలలు ఎంతో అనువుగా ఉంటాయి. నేల PH విలువ 6.5 నుండి 7.5 వరకు ఉంటే.. ఆ భూమిలో వెనిలా మొక్కలు బాగా పెరుగుతాయి. వెనిలా పండ్లు పొడవుగా ఉంటాయి. వెనిలా పుష్పించి.. కాయలు కాసి.. కోతకు రావడానికి దాదాపు 10 నెలల సమయం పడుతుంది.
అనంతరం వాటి నుంచి విత్తనాలను వేరు చేస్తారు. ఈ విత్తనాలను అనేక ఆహార పదార్థాల తయారీలో వినియోగిస్తారు. ప్రస్తుతం మనదేశంలో కిలో వెనీలా విత్తనాల ధర రూ.40 నుంచి 50 వేల వరకు పలుకుతున్నాయి. వెనీలాను పెద్ద ఎత్తున సాగు చేస్తే.. రైతులు కోటీశ్వరులవుతారు. అంత బాగా లాభాలు వస్తాయి.
ఈ సమాచారం సోషల్ మీడియా మరియు ఇంటర్నెట్ నుండి సేకరించబడింది. ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే, మరింత సమాచారం తెలుసుకునేందుకు వ్యాపార నిపుణలను సంప్రదించగలరని మనవి. ఈ సమాచారాన్ని www.TeluguBucket.Com ధృవీకరించడం లేదు.