ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Business Ideas in Telugu: రెండేళ్ల క్రితం పుట్టుకొచ్చిన ఈ కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా మానవ జీవిత విధానాన్ని మార్చేసింది. ఈ కరోనా కారణంగా చాలా మంది తమ ఉపాధి, ఉద్యోగాలను కోల్పోయారి. అయితే.. ఈ కరోనా కొత్త కొత్త వ్యాపారాలను సైతం సృష్టించింది. ముఖ్యంగా ఆన్లైన్ సేవలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.
ప్రజలు అన్ని రకాల వస్తువులను ఆన్లైన్లోనే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా నిత్యావసరాలు, పండ్లు తదితర పదార్థాలను ఆన్లైన్లోనే ఆర్డర్ చేస్తున్నారు. కరోనా కంటే ముందే ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసే విధానం మన దగ్గర కూడా అందుబాటులోకి వచ్చాయి. (ప్రతీకాత్మక చిత్రం)
జొమాటో, స్విగ్గీ లాంటి సంస్థలు ఆన్లైన్ ఫుడ్ వ్యాపారాన్ని కొత్త పుంతలు తొక్కించాయి. అయితే.. ఆన్లైన్లో టిఫిన్ కు మాత్రం ఆశించినంతగా ఆర్డర్లు ఉండడం లేదు. ఇందుకు కారణంగా.. వాస్తవంగా టిఫిన్ ధర తక్కువుగా ఉంటుంది.
అయితే.. ఆన్లైన్లో వీటిని ఆర్డర్ చేస్తే సర్వీస్ ఛార్జితె కలిపి మొత్తం ధర అధికమవుతుంది. ఈ నేపథ్యంలో సామాన్యులు టిఫిన్ ను ఆన్లైన్లో ఆర్డర్ చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో మీరు కూడా కొత్తగా బిజినెస్ ప్రారంభించాలని భావిస్తే ఆన్లైన్ టిఫిన్ వ్యాపారాన్ని ప్రారంభించడం బెస్ట్ ఐడియాగా చెప్పొచ్చు.
ఈ వ్యాపారాన్ని మీరు ఇంటి నుంచే ప్రారంభించవచ్చు. కేవలం రూ. 5 నుంచి రూ. 10 వేల పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. కాకపోతే ఈ బిజినెస్ కు మీ స్థానికంగా పబ్లిసిటీ చేయడం అవసరం. మీరు వాట్సాప్ ద్వారా ఆర్డర్లు, యూపీఐ ద్వారా బిల్ ను తీసుకోవచ్చు.
అయితే.. ఈ వ్యాపారం కోసం మంచి వంట మాస్టర్ ను మాత్రం నియమించుకోవాల్సి ఉంటుంది. మీకు టూ వీలర్ ఉంటే.. మీరు డెలివరీలు చేయొచ్చు. ఆర్డర్లు పెరుగుతున్నా కొద్దీ.. డెలివరీ చేయడానికి బాయ్స్ ను నియమించుకోవచ్చు.
వర్క్ ఫ్రం హోం విధానంలో పని చేసే వారు, కరోనా కారణంగా ఇంటి నుంచి బయటకు రావడానికి ఇష్టపడని అనేక మందికి ఈ వ్యాపారం ద్వారా సేవలు అందించవచ్చు. ఇంకా బ్యాచలర్స్ సైతం ఈ సేవలు పొందేందుకు ఆసక్తి చూపుతారు.
మీరు మంచి క్వాలిటీతో సేవలు అందిస్తే మీ వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సాయంత్రం స్నాక్స్ కూడా డెలివరీ చేయొచ్చు. ఈ బిజినెస్ బాగా క్లిక్ అయితే.. రోజుకు రూ.2 వేలు, నెలకు రూ.60 వేల వరకు సంపాధించే అవకాశం ఉంటుంది.
ఈ సమాచారం సోషల్ మీడియా మరియు ఇంటర్నెట్ నుండి సేకరించబడింది. ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే, మరింత సమాచారం తెలుసుకునేందుకు వ్యాపార నిపుణలను సంప్రదించగలరని మనవి. ఈ సమాచారాన్ని www.TeluguBucket.Com ధృవీకరించడం లేదు.