ముంబై: ఆయిల్ ఇండస్ట్రీ- ఎవర్ గ్రీన్. సీజన్‌తో పని ఉండదు.. ఎప్పుడూ గిరాకీ ఉండనే ఉంటుంది సెక్టార్‌కు. ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ సెగ్మెంట్‌కు చెందినది కావడం వల్ల దీనికి ఉన్న డిమాండే వేరు. పైగా- కొంతకాలంగా ఆయిల్ ఇండస్ట్రీకి గిరాకీ భారీగా ఉంటోంది. ఇలాంటి చోట ఇన్వెస్ట్ చేయగలిగితే- భారీ లాభాలను ఆర్జించే అవకాశం ఉంది. లక్షల రూపాయలను పెట్టుబడిగా పెట్టాల్సిన అవసరం కూడా లేదు. చిన్నపాటి మొత్తాన్ని పెట్టుబడి పెట్టి- దాన్ని సమర్థవంతంగా వినియోగించుకోగలిగితే లాభాలే లాభాలు వస్తాయని మార్కెట్ వర్గాలు స్పష్టం చేస్తోన్నాయి.
దేశంలో కొంతకాలంగా వంటనూనెల ధరలు భారీగా పెరుగుతోన్న విషయం తెలిసిందే. పెట్రోల్, డీజిల్ రేట్లు 120 రూపాయల వరకు పలుకుతుండటంతో రవాణా ఖర్చు తడిసి మోపెడవుతోంది. ఇక రష్యా-ఉక్రెయిన్ మధ్య సుదీర్ఘకాలంగా సాగుతున్న యుద్ధం సైతం ధరల పెరుగుదలకు కారణమైంది. దిగుమతి మీద ఆధారపడిన దేశం కావడం వల్ల వంటనూనెల రేట్లు ఎప్పుడూ లేని స్థాయిలో పలుకుతున్నాయి. లీటర్ వంటనూనె ధర కొనాలంటే ఎంత లేదన్నా 160 రూపాయలను ఖర్చు చేయాల్సి వస్తోంది.
ఇదివరకు ఈ రేటు 60 నుంచి 70 రూపాయల మధ్యే ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేదు. 160 రూపాయలు ప్రారంభ రేట్లుగా ఉంటోన్నాయి. ఇక గరిష్ఠంగా చూసుకుంటే లీటర్ ఒక్కింటికి 300 రూపాయలకు పైగా మొత్తాన్ని వ్యయం చేయాల్సిన పరిస్థితి దేశంలో ఏర్పడింది. దేశంలో నెలకొన్న ద్రవ్యోల్బణానికి ఇది ఓ సూచికగా భావిస్తున్నారు మార్కెట్ విశ్లేషకులు. కొద్దిరోజుల వ్యవధిలోనే వంటనూనెల ధరలు లీటర్‌పై 40 శాతం వరకు పెరిగాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంతో పాటు సన్‌ఫ్లవర్, పామాయిల్ సరఫరాకు మేజర్ మార్కెట్‌గా ఉన్న బ్రెజిల్, ఇండోనేషియా, మలేషియాల్లో ఉత్పత్తి తగ్గడంతో మరింత దెబ్బతీసినట్టవుతోంది.
ఈ పరిణామాల మధ్య ఈ సెగ్మెంట్‌లో పెట్టుబడులు పెట్టొచ్చని, భారీ లాభాలు వస్తాయని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తోన్నాయి. తక్కువ పెట్టుబడితో ఓ చిన్నపాటి ఆయిల్ మిల్‌ను ఏర్పాటు చేసుకుని సొంతంగా వాటిని విక్రయించుకుంటే లాభాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇదివరకు ఆవాల నుంచి నూనెను తీయడానికి భారీ యంత్రాలు అవసరం అయ్యేవి. ఇప్పుడక్కర్లేదు. పోర్టబుల్ మిషన్లు అందుబాటులోకి వచ్చాయి. వాటి రేట్లు కూడా తక్కువే. వాటిని అమర్చడానికి స్థలం గానీ.. పెద్ద సంఖ్యలో కార్మికులను పనిలోకి తీసుకోవాల్సిన అవసరం గా లేదు.
నూనెను తీయడానికి అవసరమైన మిషన్లు, దాన్ని వెలికి తీయడానికి అవసరమై సీడ్లు, ఓ చిన్న గది అందుబాటులో ఉంటే చాలు- ఓ చిన్నపాటి ఆయిల్ మిల్‌ను సొంతంగా పెట్టేసుకోవచ్చు. ఈ తరహా పోర్టబుల్ మిషన్లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. రెండు లక్షల రూపాయలకు ఆయిల్ ఎక్స్‌పెల్లర్ మిషన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఆయిల్ మిల్ పెట్టుకోవడానికి అవసరమైన అనుమతులు తీసుకోవడం.. ఇతరత్రా ఖర్చుల కోసం మరో రెండు లక్షల రూపాయలను వేసుకున్నా సొంతంగా ఆయిల్ పెట్టేయ్యొచ్చు.
జాగ్రత్తగా మార్కెటింగ్ చేసుకోగలిగితే- లాభాలే లాభాలు వస్తాయి. తమ ప్రొడక్ట్‌ను వినియోగదారుల వద్దకు చేర్చడానికి ఆన్‌లైన్ మార్కెటింగ్ విధానాన్ని కూడా అనుసరించవచ్చు. ఇంటి వద్దే ఓ రిటైల్ కౌంటర్‌ను కూడా తెరచుకోవచ్చు. షాప్‌లో అమ్మే రేటుకు కొంత తక్కువకు విక్రయించుకున్నా.. కొనుగోలుదారులు ఈ కౌంటర్ వద్దకు బారులు తీరుతారు. వంటనూనె వ్యాపారం ఎవర్ గ్రీన్ కావడం వల్ల సంవత్సరం పొడవునా లాభాలను ఆర్జించడానికి అవకాశం ఉంది.
ఈ సమాచారం సోషల్ మీడియా మరియు ఇంటర్నెట్ నుండి సేకరించబడింది. ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే, మరింత సమాచారం తెలుసుకునేందుకు వ్యాపార నిపుణలను సంప్రదించగలరని మనవి. ఈ సమాచారాన్ని www.TeluguBucket.Com ధృవీకరించడం లేదు.
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.