ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Health benefits of Grapes in Telugu – ద్రాక్ష పండ్లు వల్ల కలిగే ప్రయోజనాలు
దాదాపు 8000 సంవత్సరాల ముందు ద్రాక్ష పండ్ల యొక్క సాగు మిడిల్ ఈస్ట్ లో మొదలయ్యింది. ద్రాక్ష పండు తోలు పై ఉండే సూక్ష్మ జీవి అయిన ఈస్ట్ ను కనుగొన్న తరవాత దీనిని వైన్ తయారీ లో ఉపయోగించటం మొదలుపెట్టారు.
ద్రాక్ష పండ్లు విడిగా కాకుండా ఒక గుచ్చ రూపంలో ఎదుగుతాయి. ఇవి బ్లాక్, గ్రీన్, యెల్లో, ఆరంజ్, క్రిమ్సన్, డార్క్ బ్లూ మరియు పింక్ కలర్ లలో లభ్యమవుతాయి. ద్రాక్ష పండ్లలో ముఖ్యంగా 3 రకాలు ఉంటాయి. యురోపియన్ గ్రేప్స్, నార్త్ అమెరికా గ్రేప్స్ మరియు ఫ్రెంచ్ హైబ్రీడ్స్
ద్రాక్ష పండ్లలోని కొన్ని రకాలలో విత్తనాలు ఉంటాయి కొన్ని రకాలలో విత్తనాలు ఉండవు. ద్రాక్షపండ్లలో మంచి మోతాదులో పోషక విలువలు ఉంటాయి. ఒక 100 గ్రాముల ద్రాక్ష లో కింద చూపిన విధంగా పోషక విలువలు ఉంటాయి.
పేరు | మొత్తం |
శక్తి (Energy) | 69cal |
Vitamin A, IU | 66IU |
నీరు (Water) | 80.5g |
కార్బో హైడ్రేట్ (Carbohydrate) | 18.1g |
షుగర్ (Sugars) | 15.5g |
ఫ్రూక్టోజ్ (Fructose) | 8.13g |
గ్లూకోజ్ (Glucose) | 7.2g |
ఫైబర్ (Fiber) | 0.9g |
ప్రోటీన్ (Protein) | 0.72g |
కొవ్వు (fat) | 0.16g |
పొటాషియం (Potassium) | 191mg |
ఫాస్ఫరస్ (Phosphorus) | 20mg |
కాల్షియం (Calcium) | 10mg |
మెగ్నీషియం (Magnesium) | 7mg |
కోలిన్ (Choline) | 5.6mg |
Vitamin C | 3.2mg |
సోడియం (Sodium) | 2mg |
లుటిన్ మరియు జియాక్సంతిన్ (Lutein + zeaxanthin) | 72µg |
కెరోటిన్ (Carotene) | 39µg |
Vitamin K | 14.6µg |
ద్రాక్ష పండు ఒక మంచి ఆంటీ యాక్సిడెంట్ గా పనిచేస్తుంది (Anti oxidant): ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల నే మన శరీరం రక రకాల దీర్ఘ కాళికా సంభందిత వ్యాధుల బారిన పడుతుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ కి వ్యతిరేకంగా ఆంటీ యాక్సిడెంట్ లు పనిచేస్తాయి. ద్రాక్ష పండు లో ఉండే పోలీఫెనోల్స్ వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, వీటిలో ఉండే ఆంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ కి వ్యతిరేకంగా పనిచేయటంలో సహాయపడుతుంది.
ఆంటీ యాక్సిడెంట్ లు ఎక్కువగా కాంకర్డ్ (Concord) , పర్పల్ (purple) మరియు ఎర్ర (Red) ద్రాక్ష పండ్లలో ఉంటాయి. కాంకర్డ్ ద్రాక్షపండ్లను నల్ల రంగు ద్రాక్ష పండ్లని అని కూడా మనం పిలుస్తూ ఉంటాము.
- Fruits Valla Kalige Arogya Prayojanalu
- Arogya Sutralu
- Health Tips in Telugu
ద్రాక్ష గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది: ద్రాక్ష పండ్ల సీడ్స్ ఎక్స్ట్రాక్ట్ మరియు ద్రాక్ష పండ్ల జ్యూస్ వయసు తో పాటు వచ్చే అథెరోస్క్లెరోసిస్ (atherosclerosis) అనే గుండె కు సంబంధించిన సమస్య నుంచి కాపాడటంలో సహాయపడుతుంది.
అథెరోస్క్లెరోసిస్ అనే సమస్య లో ఆర్టెరీస్ (ధమనులు) లో ప్లేక్ జమ అవ్వటం వల్ల సన్నగా మారుతాయి. ఫలితంగా గుండె కు సంబంచిన వ్యాధులు రావటం జరుగుతుంది. ద్రాక్ష పండ్ల యొక్క సీడ్ ఎక్స్ట్రాక్ట్ మరియు కాంకర్డ్ గ్రేప్ జ్యూస్ మన రక్తం లోని ప్లేట్ లెట్స్ ను సక్రమంగా పనిచేయటంలో మరియు ఒకటే దగ్గర అతుక్కొని ఉండకుండా సహాయపడుతుంది.
ప్లేట్ లెట్స్ ఒకటే దగ్గర అతుక్కొని ఉండి పోవటం వల్ల గుండె పోటు లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఒక అధ్యయనం ప్రకారం ఎర్ర ద్రాక్షపండ్ల జ్యూస్ తాగటం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ అయిన LDL తగ్గటాన్ని మరియు మంచి కొలెస్ట్రాల్ అయిన HDL పెరగటాన్ని గమనించటం జరిగింది.
ద్రాక్ష క్యాన్సర్ కి వ్యతిరేకంగా పనిచేయటంలో సహాయపడుతుంది:
ద్రాక్ష పండ్ల యొక్క తోలు మరియు విత్తనాలలో ఆంటియాక్సిడెంట్స్ ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఫలితంగా ఇది వివిధ రకాల దీర్ఘకాలిక రోగాల నుంచి కాపాడటంలో సహాయపడుతుంది. ద్రాక్షపండ్లలో ఉండే ఫెనోలిక్ సమ్మేళనాలు ఆంటీ క్యాన్సర్ లక్షణాలను కలిగి ఉంటుంది. క్యాన్సర్ కి కారణమయ్యే కణాలను చంపటంలో సహాయపడతాయి.
ఈ కాలంలో క్యాన్సర్ అనే వ్యాధి నుంచి చాలా మంది భాధ పడుతున్నారు మరియు చనిపోతున్నారు. ద్రాక్షపండ్లలో ఉండే రెస్వెరాట్రాల్ (Resveratrol) కూడా ఒక మంచి అంటి యాక్సిడెంట్. జంతువుల పై జరిగిన పరిశోధనలో ద్రాక్షపండు తోలు ఎక్స్ట్రాక్ట్ ప్రోస్టేట్ (prostate) క్యాన్సర్ కి వ్యతిరేకంగా పనిచేయటం గమనించటం జరిగింది.
ద్రాక్షపండ్లలో ఆంటీ ఇన్ఫ్లమేషన్ గుణాలు ఉన్నాయి: జంతువుల మీద జరిపిన ఒక పరిశోధనలో ద్రాక్షపండ్ల విత్తనాల్లో ఉండే ఫెనోలిక్ సమ్మేళనాలు ఆంటీ ఇన్ఫ్లమేషన్ ప్రభావాన్ని చూపింది. ఈ పరిశోధనలో ద్రాక్షపండ్ల యొక్క తోలు మరియు విత్తనాల ఎక్స్ట్రాక్ట్ చెవి యొక్క వాపును మరియు ఎడెమా (edema) అనే శరీరంలో వాపుకు కారణమయ్యే సమస్యను తగ్గించటంలో సహాయపడింది. ద్రాక్ష హై ఫ్యాట్ డైట్ మరియు ఊబకాయం వల్ల వచ్చే గుండె కు సంబంధించిన సమస్యలనుంచి మరియు జీవక్రియ లోపాలు (metabolic disorders) నుంచి కాపాడటంలో సహాయపడుతుంది.
ద్రాక్ష డయాబెటిస్ నుంచి కాపాడటంలో సహాయపడుతుంది: ద్రాక్ష లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉండటం వల్ల శరీరంలోని షుగర్ లెవెల్స్ ను త్వరగా పెంచకుండా ఉంచటంలో సహాయపడుతుంది. టైపు 2 డయాబెటిస్ సమస్యనుంచి బాధపడేవారికి ఇది మంచి ప్రయోజనాలను ఇవ్వటంలో దోహదపడుతుంది.
ద్రాక్ష ఆంటీ ఏజింగ్ లో సహాయపడుతుంది: ద్రాక్ష పండ్లలో ఉండే ఆంటీ యాక్సిడెంట్ గుణాలు ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడటంలో మరియు ఆక్సీకరణ నష్టం (Oxidative damage) నుంచి కాపాడటంలో సహాయపడుతుంది. జంతువుల మీద జరిపిన పరిశోధనలో ద్రాక్ష పండ్ల యొక్క జ్యూస్ డోపమైన్ విడుదలకు మరియు జ్ఞాన పరమైన ఎదుగుదలకు సహాయపడింది.
ద్రాక్ష లో యాంటీమైక్రోబయల్ గుణాలు ఉన్నాయి: గ్రేప్ వైన్ లో ఉండే ఫెనోలిక్ సమ్మేళనాలు సూక్షజీవుల నుంచి కాపాడటంలో సహాయపడుతుంది, రెడ్ వైన్ మరియు వైట్ వైన్ లో ఉండే ఆంటీమైక్రోబయల్ గుణాలు వ్యాధి కారకులైన సూక్ష్మజీవుల నుంచి కాపాడటంలో సహాయపడుతుంది. ద్రాక్ష పండ్ల యొక్క తోలు, ఆకులు మరియు విత్తనాలలో ఎక్కువగా ఆంటీమైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి.
ద్రాక్ష కంటి యొక్క ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది: జంతువుల మీద జరిపిన ఒక పరిశోధనలో ద్రాక్షపండ్లతో కూడిన డైట్ కంటి యొక్క రెటీనా ను కాపాడటంలో సహాయపడుతుంది. ద్రాక్ష వయసుతో పాటు వచ్చే మక్యూలర్ డిజెనెరేషన్ మరియు కేటరాక్ట్ (కంటి శుక్లాలు) లాంటి సమస్యల నుంచి కాపాడటంలో సహాయపడుతుంది.
ద్రాక్ష పండ్లు ఎముకల ఆరోగ్యానికి సహాయపడతాయి: ద్రాక్షపండ్లలో ఉండే మెగ్నీషియం, కాల్షియం, మాంగనీస్, పొటాషియం ఎముకల ఆరోగ్యానికి దోహదపడుతుంది. ఒక 100 గ్రాముల ద్రాక్ష లో 191 గ్రాముల పొటాషియం, 20 మిల్లీగ్రాముల ఫాస్పరస్, 10 మిల్లి గ్రాముల కాల్షియం, 7 గ్రాముల మెగ్నీషియం ఉంటుంది.
ద్రాక్ష పండ్లు వల్ల జీర్ణ వ్యవస్థను మెరుగుపడుతుంది: ద్రాక్ష పండ్లలో ఉండే ఫైబర్ మరియు పోలీఫెనోల్స్ జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి సహాయపడుతుంది. ద్రాక్ష లో ఉండే కరగని పీచుపదార్థము (insoluble fiber) మలానికి సంబంచిన సమస్యలనుంచి కాపాడటంలో సహాయపడుతుంది.
Health benefits of Grapes in Telugu – ద్రాక్ష పండ్లు వల్ల కలిగే ప్రయోజనాలు