ఈ శ్రీచక్రానికి మించిన చక్రము ఈ సృష్టిలో ఏదీ లేదు. అందుకే అది “చక్రరాజము” అయినది. సమస్త దోషములను నివారించి సమస్త కోరికలను తీర్చి, సకల సౌభాగ్యాలు ఇచ్చే దివ్యమైన యంత్రమే ఈ శ్రీచక్రం. శ్రీవిద్యోపాసన, శ్రీచక్రార్చన అందరికీ సులభ సాద్యం కాదు. ఐనా పట్టుదలతో చేస్తే సాధించలేనిది అంటు ఏమి లేదు ఈలోకములో కాస్త కష్టమే ఐనా అసాద్యము మాత్రము కాదు సుమా.
మన దేహమే ఈ శ్రీచక్రము. సాధకుడి దేహము ఈ శ్రీచక్రమనే దేవాలయము మన దేహము నవ రంద్రములతో ఏర్పడింది అని మనమేరుగుదుము అటులనే ఈ శ్రీచక్రము తొమ్మిది ఆవరణలతో ఏర్పడిన చక్ర సమూహమే ఈ శ్రీచక్రము’ మనిషి శరీరంలో ఉన్న షట్చక్రాలకూ, ఈ శ్రీచక్రము లో ఉన్న తొమ్మిది అవరణలు అవినాభావ సంబధము కలదు.
శరీరంలోని నవ ధాతువులకు ఈ నవ ఆవరణలు ప్రతీకలు. ఈ శ్రీచక్రముని 9 బాగాలు విడమర్చి 9 ఆవరణములుగా చెప్పెదరు ‘అందుకే శ్రీచక్రమునకు నవావరణ పూజ అనే పూజని చేయ్యటం మనలో చలామందికి తేలుసు. 4 శివ చక్రములు, 5 శక్తి చక్రములు కలసి మొత్తం తొమ్మిది చక్రములతో ఆ పరదేవత విరాజిల్లుతూ వుంటుంది.
ఈ 9 చక్రములను విడదీసి విడివిడిగా ఒక్కో చక్రానికి ఒక్కో దేవత అదిష్టానం వహిస్తూ ఉంటుంది. ఇక చిట్ట చివరన బిందు స్తానంలో కామేశ్వరుడితో కామేశ్వరి ఆలింగన ముద్రలో వుంటారు. ఇక్కడ శివుడు శక్తి ఏకమై ఉండడం వలన మనకు బిందువుని చూచిక గా చేబుతారు పేద్దలు శివడు శక్తితో కలసి ఈ చక్రములతో నివసించడం వలన శివశక్తైక్య రూపిణి వీరిరువురూ కలయికే ఈ లలితాంబిక అయినది.
అర్ధనారీశ్వర తత్వమే ఇక్కడకూడా ఆ పరమేశ్వరుడి లీలా వినోదం ఏమని చేప్పిగలo , కామ కామేశ్వరుల నిలయము , సృష్టికి మరో రూపమై వెలుగుచున్న ఈ శ్రీచక్ర వైభవాన్ని వేనోళ్ళ పోగడడం తప్ప ఇంకేం చేప్పగలను. ఈ అనంత సృష్టికి సూక్ష్మ రూపమే ఈ శ్రీచక్రమని చేప్పనా. లేక పర దేవి నిలయమే ఈ శ్రీచక్రమని చేప్పనా. లేక ఆ పరాదేవియే ఈ శ్రీచక్రమని చేప్పనా లేక మహోగ్ర రూపిణీ ఆ వారాహినే ఈ చక్ర సామ్రాజ్య సేనాదీ కాపు గాస్తుందని చేప్పనా యంతని చేప్పను ఏమని చేప్పను.
ఈ శ్రీచక్రము 3 రకములుగా ఆరాదించబడుతుంది ఈ లోకంలో 1 మేరు ప్రస్తారము. 2 కైలాస ప్రస్తారము 3 భూ ప్రస్తారము. సకల కోటి మహా మంత్రములతో సకల దేవి దేవతల సమిష్టి రూపమే ఈ శ్రీచక్రము ఇటుటువంటి చక్రరాజాన్ని ఉపాసించడం వలన, సకల మంత్ర తంత్ర మూలికా గుఠికా జ్ఞానము మరియూ ముక్తి ప్రాప్తించునని నని మన పూర్వ సాదకులు మరియు మన ఋషులు నోక్కీ ఓక్కాణ్ణిoచి చేప్పియుంనారు.
ఈ శ్రీచక్రము యొక్క నాలుగు ద్వారాలు మహా వాక్యాలకు గుర్తులు . ఆ ద్వారాలలో గనుక సాదకుడు ప్రవేశించి గలిగితే ఆ పరదేవతా సాక్షాత్కారం లభించినట్లే. ఈ శ్రీవిద్యను మొదట శివుడు పార్వతికి ఉపదేశించెను. ఆ పరమ శివుడు పరమ దయాలుడు కనుక జగత్తునందు గల అల్ప ప్రాణులైన మానవుల కామ్యములు తీర్చుకోవటం కొరక (64) తంత్రములను సృష్టించి పరదేవత కోరిక మేరకు నాలుగు పురుషార్ధములు తీరునట్లుగా ఈ శ్రీవిద్య తంత్ర విధానము వలన సకల శక్తి చైతన్యం కలిగేట్టుగా ఈ శ్రీవిద్యా తంత్రమును, శ్రీచక్ర యంత్రమును ఆ పరమేశ్వరునిచే స్రుష్టి కావించడంజరిగింది.
ఈ శ్రీచక్రము అన్ని మంత్ర, యంత్ర, తంత్రములలో కెల్లా గొప్పదని, సాక్షాత్తు ఆ ఈశ్వరుడు, పరమేశ్వరి యొక్క ప్రతి రూపమని తాంత్రిక సాదకులకు మరియు కుల యోగులకు కౌళమార్గములో ఉన్నా వారికి మాత్రమే అధికారము కలదు కనుక వారికి మాత్రమే ఈ శ్రీవిద్యా తంత్రమును! ఇక మిగతా వారికి 64 తంత్రములు అని మన ఋషులు నిర్దేశించిరి.
ఈ శ్రీచక్రఉపాసన వలన, మరియు శ్రీచక్రార్చన వలన పరా శక్తి అనుగ్రహం చే అన్ని శక్తులు అన్ని సిద్దులు మరియు తత్వ విచారణపై ఆసక్తి కలిగి, ఇహలోక భోగముల యందు విరక్తి కలుగును. అందువలన సుద్ద బ్రహ్మ జ్ఞానము కలుగును అందుకే దీనిని బ్రహ్మవిద్య అని కోందరు. కోందరు కౌళ విద్య లేదా కుల విద్య అని అందురు.
ఈ శ్రీవిద్యా మహా మంత్రములు మహా యంత్రంము అనునవి మోక్ష సాధకములగును కనుక ఏకరాలు ఏకరాలు శ్రీ చక్రాన్ని వేసినంత మాత్రాన నీలో ఉండే కాముడు చావడు’ కిలోల కోద్దీ కుంకము భూమి పాలుచేసినంత మాత్రన ఈ కలిమాయ నిన్నంటకుండాపోదు.కుర్చీల్లో కూర్చుని యజ్న యాగాలు చేసినంత మాత్రాన యముడు నీన్నేత్తుకు పోడనూకున్నావా!
ఈ సమాచారం నచ్చితే తప్పకుండా షేర్ చెయ్యండి
What is Sri Chakram? Sri Chakram Importance, Hindu Mythology, Greatness of Hinduism, Indian Culture
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.