Menu Close

Atu Nuvve Itu Nuvve Song Lyrics in Telugu

అటు నువ్వే ఇటు నువ్వే… మనసెటు చూస్తే అటు నువ్వే
ఎటు వెళ్తున్నా ఏం చేస్తున్నా… ప్రతిచోటా నువ్వే

అటు నువ్వే ఇటు నువ్వే… అలికిడి వింటే అది నువ్వే
అదమరుపైనా పెదవుల పైనా… ప్రతి మాటా నువ్వే
అపుడో ఇపుడో ఎపుడైనా… నా చిరునవ్వే నీ వలన
తెలియని లోకం తీపిని… నాకు రుచి చూపావులే

పరిచయమంతా గతమేనా… గుర్తుకురాదా క్షణమైనా
ఎదురుగ ఉన్న నిజమే కాని కలవైనావులే

రంగు రూపమంటూ… లేనె లేనిదీ ప్రేమ
చుట్టూ శూన్యమున్నా… నిన్ను చూపిస్తూ ఉంది
దూరం దగ్గరంటూ… తేడా చూడదీ ప్రేమా
నీలా చెంత చేరి… నన్ను మాటాడిస్తుంది

కనుపాప లోతులో… దిగి పోయె ఎంతలా
ఒక రెప్పపాటు కాలమైనా మరపేరావుగా
ఎద మారుమూలలో… ఒదిగున్న ప్రాణమై
నువ్వు లేని నేను లేనే అనిపించావుగా

అటు నువ్వే ఇటు నువ్వే… మనసెటు చూస్తే అటు నువ్వే
ఎటు వెళ్తున్నా ఏం చేస్తున్నా… ప్రతిచోటా నువ్వే

అటు నువ్వే ఇటు నువ్వే… అలికిడి వింటే అది నువ్వే
అదమరుపైనా పెదవుల పైనా… ప్రతి మాటా నువ్వే

నాకే తెలియకుండా… నాలో నిన్ను వదిలావే
నేనే నువ్వయేలా… ప్రేమ గుణమై ఎదిగావే
మాటే చెప్పకుండా… నీతో నువ్వు కదిలావే
ఇటుగా చూడనంటూ… నన్ను ఒంటరి చేసావే

ఏకాంత వేళలో… ఏ కాంతి లేదురా
నలుసంత కూడా జాలిలేని… పంతాలేంటి ఇలా
నీ తోడు లేనిదే మనసుండలేదురా… నీ పేరు లేని ప్రేమ నైనా ఊహించేదెలా

అటు నువ్వే ఇటు నువ్వే… మనసెటు చూస్తే అటు నువ్వే
ఎటు వెళ్తున్నా ఏం చేస్తున్నా… ప్రతిచోటా నువ్వే

అటు నువ్వే ఇటు నువ్వే… అలికిడి వింటే అది నువ్వే
అదమరుపైనా పెదవుల పైనా… ప్రతి మాటా నువ్వే

Like and Share
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading