Menu Close

Ye Shwasalo Song Lyrics In Telugu

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

వేణుమాధవా… వేణుమాధవా…
ఏ శ్వాసలో చేరితే… గాలి గాంధర్వమౌతున్నదో || 2 ||
ఏ మోవిపై వాలితే… మౌనమే మంత్రమౌతున్నదో…

ఆ శ్వాసలో నే లీనమై… ఆ మోవిపై నే మౌనమై…
నిను చేరని మాధవా… ఆఆ ఆఆ…
ఏ శ్వాసలో చేరితే… గాలి గాంధర్వమౌతున్నదో…

మునులకు తెలియని జపములు జరిపినదా… మురళీ సఖీ
వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా…
తనువును నిలువున తొలిచిన గాయములే… తన జన్మకీ
తరగని వరముల సిరులని తలచినదా…

కృష్ణా నిన్ను చేరింది… అష్టాక్షరిగ మారింది
ఎలా ఇంత పెన్నిధి… వెదురు తాను పొందింది…
వేణుమాధవా నీ సన్నిధీ…

ఏ శ్వాసలో చేరితే… గాలి గాంధర్వమౌతున్నదో…
ఏ మోవిపై వాలితే… మౌనమే మంత్రమౌతున్నదో…

చల్లని నీ చిరునవ్వులు కనపడక… కనుపాపకీ
నలువైపుల నడిరాతిరి ఎదురవదా…
అల్లన నీ అడుగుల సడి వినబడక… హృదయానికీ…
అలజడితో అణువణువూ తడబడదా…
అఆఆ… ఆ ఆ ఆ… ఆఆ ఆఆ ఆ… ఆ… ఆ… ఆ…

నువ్వే నడుపు పాదమిది… నువ్వే మీటు నాదమిది…
నివాళిగా నా మది… నివేదించు నిమిషమిది…
వేణుమాధవా నీ సన్నిధీ…

గాగ్గరిగరిసరి గాగ్గరీరి సరి… గపదసాస దపగరిసరి…
గపదపదా గపదసదా దాపాగరిగా…
దపదసస్స దపదసస్స… దపదరిర్రి దపదరిర్రి
దసరిగరిసరి…
గరిసరిగ గ రి గారిసరిగా…
రి స ద ప గగగపాప్ప… గగగదాద్ద… గగగసాస్స
ద ప గ ప గ స రి స రి స రి గ రి స…
ద స రి గ మ ప స గ రి మ గ ప గ స రి స రి గ మ ప ని
స గ ప ద ప స గ స ప ద ప స గ స ప ద
ప ద ప రి స రి ప ద ప రి స రి
ప ద స రి గ రి స గ ప ద స గ గ స రి గ స గా
స రి గ ప ద స రి గా… ఆ ఆ ఆ…

రాధికా హృదయ రాగాంజలీ…
నీ పాదముల వ్రాలు కుసుమాంజలి… ఈ గీతాంజలి…

Like and Share
+1
2
+1
6
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading