ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Nupur Sharma Controversy Statements in Telugu
ముహమ్మద్ ప్రవక్త పై బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ చేసిన ప్రకటన ప్రపంచ వ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఈ వ్యాఖ్యపై పలు అరబ్ దేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ భారత రాయబారులను పిలిపించి తమ అసంతృప్తిని వ్యక్తం చేశాయి.
ముహమ్మద్ ప్రవక్త , ముస్లిం సమాజంపై కించపరిచే వ్యాఖ్యలు చేసినందుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పార్టీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మను సస్పెండ్ చేసి, నవీన్ జిందాల్‌ను బహిష్కరించిన విషయం తెలిసిందే.
కువైట్: నూపుర్ శర్మ చేసిన ప్రకటనకు అనేక దేశాలు ప్రతిచర్యలకు దిగుతున్నాయి. అందులో భాగంగా కువైట్ భారతీయ ఉత్పత్తులను తొలగించింది.
కువైట్ లోని అల్ అర్దియా కోఆపరేటివ్ సొసైటీ వర్కర్లు భారతీయ ఉత్పత్తులను తొలగించినట్లు ‘అరబ్ న్యూస్’ వీడియోను విడుదల చేసింది. ప్రవక్త(స)ను అవమానించినందుకు భారతీయ ఉత్పత్తులను బహిష్కరిస్తున్నట్లు వారు తెలిపారు.
“కువైట్ ముస్లింలమైన మేము ప్రవక్త(స)ను అవమానించడాన్ని సహించబోము” అని ఆ సూపర్ స్టోర్ సిఈవో నాసీర్ అల్-ముతైరీ తెలిపాడు. గల్ఫ్ లోని అనేక ప్రాంతాల్లో భారతీయ వస్తువులు బహిష్కరించాలని అనేక మంది పిలుపును కూడా ఇచ్చారు.
గల్ప్ ప్రాంతంలో కువైట్, ఖతార్, ఇరాన్, సౌదీఅరేబియా, ఆఫ్ఘనిస్థాన్లలో కూడా భారతీయ వస్తువుల బహిష్కరణకు పిలుపునిచ్చారని సమాచారం. ఇదిలావుండగా ప్రవక్త(స)పై విమర్శలు చేసిన పార్టీ ప్రతినిధి నూపుర్ శర్మ, ఢిల్లీ మీడియా హెడ్ నవీన్ కుమార్ జిందాల్ ను బిజెపి వారి పదవుల నుంచి వెలివేసింది. కాగా వారు చేసిన వ్యాఖ్యలు అరబ్ జగత్తులో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
Nupur Sharma Controversy Statements in Telugu