Menu Close

Ye Devi Varamu Neevu Song Lyrics In Telugu – Amrutha – ఏ దేవి వరము నీవో

Ye Devi Varamu Neevu Song Lyrics In Telugu – Amrutha – ఏ దేవి వరము నీవో

ఎంత చక్కిల్ గిల్ గిల్ కళ్ళు… జిల్ జిల్ జిల్ జిల్
చెక్కిళ్ళ ముద్దు పెడితే… ఈ చిన్నారి ముద్దు పెడితే
ఎంత చక్కిల్ గిల్ గిల్… కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్
చెక్కిళ్ళ ముద్దు పెడితే… ఈ చిన్నారి ముద్దు పెడితే

ఏ దేవి వరము నీవో… చిరు నీడలేల కనులా
ఏ దేవి వరము నీవో… చిరు నీడలేల కనులా
ఆయువడిగినది నీ నీడే… ఆ ఆఆ ఆ ఆ
ఆయువడిగినది నీ నీడే… గగనం ముగియు దిశ నీవేలే
గాలి కెరటమై సోకినావే… ప్రాణవాయువే ఐనావే
మదిని ఊయలూగే… ఏఏ ఏ
ఏ దేవి వరము నీవో… చిరు నీడలేల కనులా
ఎంత చక్కిల్ గిల్ గిల్… కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్
చెక్కిళ్ళ ముద్దు పెడితే… ఈ చిన్నారి ముద్దు పెడితే
ఎంత చక్కిల్ గిల్ గిల్… కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్
చెక్కిళ్ళ ముద్దు పెడితే… ఈ చిన్నారి ముద్దు పెడితే

ఎదకు సొంతంలే… ఎదురు మాటవులే
కలికి వెన్నెలవే… కడుపు కోతవులే
స్వాతి వాననీ చిన్న పిడుగనీ
స్వాతి వాననీ చిన్న పిడుగనీ
ప్రాణమైనదీ పిదప కానిదీ
ప్రాణమైనదీ పిదప కానిదీ
మరణ జనన వలయం నీవేలే
ఏ దేవి వరము నీవో… చిరు నీడలేల కనులా
ఎంత చక్కిల్ గిల్ గిల్… కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్
చెక్కిళ్ళ ముద్దు పెడితే… ఈ చిన్నారి ముద్దు పెడితే

సిరుల దీపం నీవే… కరువు రూపం నీవే
సరస కావ్యం నీవే… తగని వాక్యం నీవే
ఇంటి వెలుగనీ కంటి నీడనీ
ఇంటి వెలుగనీ కంటి నీడనీ
సొగసు చుక్కవో తెగిన రెక్కవో
సొగసు చుక్కవో తెగిన రెక్కవో
నేనెత్తిపెంచినా శోకంలా

ఏ దేవి వరము నీవో… చిరు నీడలేల కనులా
ఏ దేవి వరము నీవో… చిరు నీడలేల కనులా
ఆయువడిగినది నీ నీడే… ఏఏ ఏ
ఆయువడిగినది నీ నీడే… గగనం ముగియు దిశ నీవేలే
గాలి కెరటమై సోకినావే… ప్రాణవాయువే ఐనావే
మదిని ఊయలూగే… ఏఏ ఏ
ఏ దేవి వరము నీవో… చిరు నీడలేల కనులా
ఎంత చక్కిల్ గిల్ గిల్ కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్
చెక్కిళ్ళ ముద్దు పెదితే ఈ చిన్నారి ముద్దు పెడితే.. ..

Ye Devi Varamu Neevu Song Lyrics In Telugu – Amrutha – ఏ దేవి వరము నీవో

Share with your friends & family
Posted in Lyrics in Telugu - Movie Songs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading