Menu Close

Kanulu Terichina Lyrics In Telugu-Aanandham

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

కనులు తెరిచినా, కనులు మూసినా… కలలు ఆగవేల
నిజము తెలిసినా, కలని చెప్పినా… మనసునమ్మదేల
ఎదుటె ఎప్పుడు తిరిగే వెలుగా… ఇదిగో ఇపుడే చూసా సరిగా
ఇన్నాళ్ళు నేనున్నది… నడిరేయి నిదురలోన
అయితే నాకీనాడే… తొలి పొద్దు జాడ తెలిసింద కొత్తగా
కనులు తెరిచినా, కనులు మూసినా… కలలు ఆగవేల

పెదవుల్లొ ఈ దరహాసం… నీకోసం పూసింది
నీ జతలో ఈ సంతోషం… పంచాలనిపిస్తోంది
ఎందుకనొ మది నీకోసం… ఆరాటం పడుతోంది
అయితేనేం ఆ అలజడిలో… ఒక ఆనందం ఉంది
దూరం మహ చెడ్డదని ఈ లోకం అనుకుంటుంది
కాని ఆ దూరమె నిన్ను… దగ్గర చేసింది
నీలో నా ప్రాణం ఉందని… ఇపుడెగా తెలిసింది
నీతో అది చెప్పింద… నీ ఙ్ఞాపకాలే నా ఊపిరైనవని

కనులు తెరిచినా, కనులు మూసినా… కలలు ఆగవేల
నిజము తెలిసినా, కలని చెప్పినా… మనసునమ్మదేల

ప్రతి నిమిషం నా తలపంతా… నీ చుట్టు తిరిగింది
ఎవరైనా కనిపెడతారని… కంగారుగ ఉంటోంది
నా హృదయం నీ ఊహలతో… తెగ ఉరకలు వేస్తోంది
నాక్కూడ ఈ కలవరమిపుడె… పరిచయమయ్యింది
అద్దంలో నా బదులు… అరె నువ్వె కనిపించావే
నేనే ఇక లేనట్టు… నీలొ కరిగించావే
ప్రేమా ఈ కొత్తస్వరం అని… అనుమానం కలిగింది
నువ్వే నా సందేహానికి… వెచ్చనైన ఋజువియ్యమంది మది

కనులు తెరిచినా, కనులు మూసినా… కలలు ఆగవేల
నిజము తెలిసినా, కలని చెప్పినా… మనసునమ్మదేల
ఎదుటె ఎప్పుడు తిరిగే వెలుగా… ఇదిగో ఇపుడే చూసా సరిగా
ఇన్నాళ్ళు నేనున్నది… నడిరేయి నిదురలోన
అయితే నాకీనాడే… తొలి పొద్దు జాడ తెలిసింద కొత్తగా

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading