
మంచి పుస్తకం దగ్గరుంటే మనకు
మంచి మిత్రులు వెంటలేని లోటు కనిపించదు
బట్టలు మనిషి అవయవాలని కప్పేటందుకూ,
అతనిని చలి నుంచి, ఎండ నుంచి రక్షించడానికి,
అంతేగాని, అర్దం పర్దం లేని అలంకారాలతో
ఆకారాన్ని వికారం చేయడానికి కాదు
దుర్భలులు ఎన్నటికీ క్షమించలేరు,
క్షమ బలవంతుల సహజ లక్షణం
ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడమే దైవసేవ
ప్రయత్నంలోనే సంతృప్తి ఉంది,
సాధించడంలో కాదు,
పూర్తి ప్రయత్నంలోనే పూర్తి విజయం ఉంటుంది