ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
ఆనందం ఆరాటం
ఆనందం అంటే అర్ధం చూపించేటి ఓ అద్భుతం
ఆరాటం అంచుల్లోనే నిత్యం సాగే ఈ సంబరం
చిగురై పుడమి కడుపున మొదలయ్యేటి ఆ మధనమే మధురమై
ఉదయం కోసం ఎదురె చూసే నిమిషాలే నిజమైన వేడుక కాదా
ఫలితం మరిచి పరుగు తీసే పయనం ఇక ప్రతిపూటోక కానుక అయిపోదా
నీరు ఆవిరిగా ఎగిసిందే
తపన పెరిగి అది కడలి నొదిలినది
కారుమబ్బులుగా మెరిసింది
అణువు అనువుగా ఒక మధువుగా మారి తానే… వానై…
అడుగు అడుగు కలిపి కదిలిపోయే కదలింటి దారే
మలుపేదైనా గెలుపే చూసే అడుగుల్లో అసలైన ఆ ఆనందం
నదిలో ఎగిసే అలల ఏదోలోపల క్షణమాగాని సంగీతం కాదా
ఇంద్ర ధనస్సులో వర్ణములే పుడమి ఒడిలో పడి చిగురు తొడిగినవి
శరదృతువులో సరిగమలే తొడిమె తడిమే తొలి పిలుపుగా మారి
దాహం తీరే వీరుల సిరులు విరిసి మురిసిపోయే సరికొత్త మాయే
ఉబికే మౌనం ఊరికే ప్రాణం తనకోసం దిగివస్తే ఆ ఆకాశం
కరిగే దూరం తెరిచే ద్వారం జగమంతట పులకింతలు పూసే వసంతం
ఆనందం ఆరాటం
ఆనందం అంటే అర్ధం చూపించేటి ఓ అద్భుతం
ఆరాటం అంచుల్లోనే నిత్యం సాగే ఈ సంబరం
చిగురై పుడమి కడుపున మొదలయ్యేటి ఆ మధనమే మధురమై
ఉదయం కోసం ఎదురె చూసే నిమిషాలే నిజమైన వేడుక కాదా
ఫలితం మరిచి పరుగు తీసే పయనం ఇక ప్రతిపూటోక కానుక అయిపోదా