డబ్బు మీ అవసరాలను మాత్రమే తీర్చగలదు. అది ఎల్లవేళలా మీకు సుఖాన్ని ఇవ్వలేదు. అందుకే ప్రతి వ్యక్తి తన జీవితంలో కొన్ని అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.
దురాశ మనిషి ఆనందాన్ని దూరం చేయడమే కాకుండా అతని ఆలోచనను చాలా సంకుచితంగా మారుస్తుందని ఆచార్య చెప్పేవారు. అత్యాశగల వ్యక్తి మొదట విశ్వాసాన్ని కోల్పోతాడు. అతను ఇతరుల పురోగతిని చూసి అసూయ చెందుతాడు. అప్పుడు అతనిలా లేదా అంతకంటే ఎక్కువగా ఉండటానికి ప్రయత్నిస్తాడు. ఈ సమయంలో చాలాసార్లు తప్పుడు దారిలో పయనిస్తూ తనకు తానే కష్టాలను కోరి ఆహ్వానిస్తాడు. కనుక దురాశకు దూరంగా ఉండండి.
కోపంగా ఉన్న వ్యక్తి యొక్క మనస్సు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండదు. అలాంటి వారు చిన్న చిన్న విషయాలకే పరధ్యానంలో పడతారు. అటువంటి పరిస్థితిలో.. చాలాసార్లు తప్పు, ఒప్పు లను కూడా గుర్తించలేరు. కోపంతో ఉన్న వ్యక్తులు తమకు తాము మాత్రమే హాని చేసుకుంటారు. అందుకే జీవితంలో ప్రశాంతత కావాలంటే కోపానికి దూరంగా ఉండండి. కోపాన్ని నియంత్రించుకోవడానికి ధ్యానం ఉత్తమ మార్గం.
మీరు ఎంత సంపదను సంపాదించినా లేదా మీకు కొన్ని ప్రత్యేక గుణాలు ఉన్నా, మీలో అహం వచ్చినట్లయితే.. అది మీ గౌరవంపై ప్రభావం చూపుతుంది. అహం చేరుకున్న వ్యక్తికీ గౌరవం తగ్గడం ప్రారంభమవుతుంది. అహం ఉన్న వ్యక్తి తనకు తానే గొప్ప అనే భావం కలుగుతుంది. అటువంటి పరిస్థితిలో.. ఆ వ్యక్తి ఆనందానికి దూరమవుతాడు. ఇతరులను చిన్నవారిగా భావిస్తాడు. అలాంటి వారు అధఃపాతాళానికి చేరుకోవడానికి ఎక్కువ సమయం పట్టదని ఆచార్య చెప్పాడు.
ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. మీరు జీవితాన్ని సంతోషంగా ఉంచుకోవాలనుకుంటే, ముందుగా మీ శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉండేలా చూసుకోండి. శరీరం అనారోగ్యానికి గురైతే.. మీకు ఇబ్బందిని ఇవ్వడమే కాకుండా.. మీ కలలను నెరవేర్చుకోవడానికి బ్రేక్ పడుతుంది. ఆరోగ్యకరమైన శరీరం విజయానికి కీలకంగా పరిగణించబడుతుంది. అందువల్ల, జీవితం సంతోషంగా ఉండటానికి, మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి.
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.