ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Muddabanthi Navvulo Lyrics in Telugu – ముద్దబంతి నవ్వులో మూగబాసలు లిరిక్స్
లాల్లలల లాల లల… లాల లాలలా
లాల్లలల లాల లల… లాల లాలలా
బంధమంటు ఎరుగని… బాటసారికి
అనుబంధమై వచ్చింది… ఒక దేవత
ఆ ఆఆ ఆఆ ఆఅ… అ ఆ ఆ ఆ ఆ ఆ ఆఆ
బంధమంటు ఎరుగని… బాటసారికి
అనుబంధమై వచ్చింది… ఒక దేవతా
ఇంత చోటులోనే… అంత మనసు ఉంచి
ఇంత చోటులోనే… అంత మనసు ఉంచి
నా సొంతమే అయ్యింది ప్రియురాలుగా
ముద్దబంతి నవ్వులో… మూగబాసలు
మూసివున్న రెప్పలపై… ప్రేమలేఖలు
ముద్దబంతి నవ్వులో… మూగబాసలు
అందమైన తొలిరేయి… స్వాగతానికి
మౌనగీతమై వచ్చింది… పెళ్ళికూతురు
ఆ ఆఆ ఆఆ ఆఅ… అ ఆ ఆ ఆ ఆ ఆ ఆఆ
ఎదుటనైన పడలేని… గడ్డిపువ్వును
గుడిలోకి రమ్మంది… ఈ దైవము
మాట నోచుకోని… ఒక పేదరాలిని
మాట నోచుకోని… ఒక పేదరాలిని
నీ గుండెలో నిలిపావు… గృహలక్ష్మిగా
ముద్దబంతి నవ్వులో… మూగబాసలు
మూసివున్న రెప్పలపై… ప్రేమలేఖలు
చదువుకునే మనసుంటే… ఓ కోయిలా
మధుమాసమే అవుతుంది… అన్నివేళలా
ముద్దబంతి నవ్వులో… మూగబాసలు
మూసివున్న రెప్పలపై… ప్రేమలేఖలు
ముద్దబంతి నవ్వులో… మూగబాసలు
Movie: Alludugaru Released Date – 14 July 1990
Director: K. Raghavendra Rao
Producer: Manchu Mohan Babu
Singers: K J Yesudas, Chitra
Music: KV Mahadevan
Lyrics: Sirivennela Seetharama Sastry
Star Cast: Manchu Mohan Babu, Shobana, Ramya Krishna
Muddabanthi Navvulo Lyrics in Telugu – ముద్దబంతి నవ్వులో మూగబాసలు లిరిక్స్