Menu Close

ఎట్టాగుందే పాప..? తొలి చూపే చుట్టుకుంటే-Telugu Lyrics

అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి

Movie: Bobbili Raja (24 September 1990)
Director: B Gopal
Singers: S P Balasubramanyam, KS Chitra
Music: Ilayaraja
Lyrics: Sirivennela Seetharama Sastry
Star Cast: Venkatesh, Divya Bharati
Producer: D. Suresh Babu
Music Lable: Aditya Music

బలపం పట్టి బామ బళ్ళో… అ,ఆ,ఇ,ఈ నేర్చుకుంటా…
పంతం పట్టి ప్రేమ ఒళ్ళో… ఆహా, ఒహో పాడుకుంటా…
అం, అః అంటా అమ్మడూ… హొయ్యరే హొయ్యరే హొయ్..
కం అః ఉండేటప్పుడూ…
బుజ్జి పాపాయీ… పాఠాలు నేర్పించు పైటమ్మ ప్రణయాలతో…

సరసమింక ఎక్కువైతే… ఛఛ ఛీఛీ తప్పదయ్యో…
అపుడే ఇట్ట ప్రేమ బళ్ళో… అయితే గియితే ఎందుకయ్యో..?
అచ్చులే అయ్యాయిప్పుడూ… హొయ్యారె హొయ్యారె హో…
హల్లుల్లో హల్లో ఎప్పుడూ..?

ఎట్టాగుందే పాప..? తొలి చూపే చుట్టుకుంటే…
ఏదో కొత్త ఊపే… ఎటువైపో నెట్టేస్తుంటే…

ఉండుండి ఎటుంచో… ఒక నవ్వే తాకుతోంది…
మొత్తంగా ప్రపంచం… మహ గమ్మత్తుగా ఉంది…

ప్రేమంటే ఇంతేనేమో… బాగుందే ఏమైనా…
నాక్కూడా కొత్తేనయ్యో… ఏం చేద్దాం ఈ పైనా..?

కాస్తైనా… కంగారు తగ్గాలి… కాదన్ను ఏం చేసినా…

సరసమింక ఎక్కువైతే… ఛఛ ఛీఛీ తప్పదయ్యో…
అపుడే ఇట్ట ప్రేమ బళ్ళో… అయితే గియితే ఎందుకయ్యో..?
అం, అః అంటా అమ్మడూ… హొయ్యరే హొయ్యరే హొయ్
కం అః ఉండేటప్పుడూ… అరె రె ఓహోహో..!

తుప్పల్లో తుపాకి సడి… ఎట్టా రేగుతుందో…
రెప్పల్లో రహస్యం పడి… అట్టా అయిందయ్యో…

కొమ్మల్లో కుకులే… మన స్నేహం కోరుతుంటే…
కొండల్లో ఎఖోలే… మనం ఎట్టా ఉన్నాం అంటే…
అడివంతా అత్తారిల్లే… నీకైనా నాకైనా…
ఎవరెవరో అత్తా మామా… వరసెట్టా తెలిసేనే..?
అందాకా… ఆ మర్రి అత్తమ్మ… ఈ మద్ది మామనుకో…

బలపం పట్టి బామ బళ్ళో… అ,ఆ,ఇ,ఈ నేర్చుకుంటా…
పంతం పట్టి ప్రేమ ఒళ్ళో… ఆహా, ఒహో పాడుకుంటా…
అచ్చులే అయ్యాయిప్పుడూ… హొయ్యారె హొయ్యారె హో
హల్లుల్లో హల్లో ఎప్పుడూ…?

పిచ్చి బుజ్జాయి… అల్లర్లు తగ్గించి ఒళ్ళోన బజ్జోవయ్యో..!

బలపం పట్టి బామ బళ్ళో… అ,ఆ,ఇ,ఈ నేర్చుకుంటా…
అపుడే ఇట్ట ప్రేమ బళ్ళో… అయితే గియితే ఎందుకయ్యో..?
అం, అః అంటా అమ్మడూ… హొయ్యరే హొయ్యరే హొయ్
హల్లుల్లో హల్లో ఎప్పుడూ…?

తననతన్న తాన నన్నా తందానన్నా తందానన్నా…
తననతన్న తాన నన్నా తందానన్నా తందానన్నా…
తందనా తందా నన్నానా… అరె హొయ్యారె హొయ్యారె హోయ్…
తందనా తందా నన్నానా… ఓహో ఒహో ఒహో హోయ్…

Like and Share
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading