ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Neelaala Ningilo Meghaala Therulo Lyrics in Telugu
నీలాల నింగిలో మేఘాల తేరులో
ఆ పాల పుంతలోనీ కౌగిలింతలో
నిలువెల్లా కరిగిపోనా నీలోనా కలిసిపోనా
నీలాల నింగిలో మేఘాల తేరులో
ఆ పాల పుంతలో నీ కౌగిలింతలో
నిలువెల్లా కరిగిపోనా నీలోనా కలిసిపోనా
నీలాల నింగిలో మేఘాల తేరులోఓఓ
ఆ నింగికి నీలం నీవై ఈ నేలకు పచ్చను నేనై
రెండూ కలిసిన అంచులలో రేపూ మాపుల సంధ్యలలో
ఎర్రని పెదవుల ముద్దులుగా నల్లని కన్నుల సుద్దులుగా
ఎర్రని పెదవుల ముద్దులుగా నల్లని కన్నుల సుద్దులుగా
మెల్లగ చల్లగ
మెత్తగ మత్తుగ హత్తుకుపోయీ
నిలువెల్లా కరిగిపోనా నీలోనా కలిసిపోనా
నీలాల నింగిలో మేఘాల తేరులో
ఆ హిమగిరి శిఖరం నీవై ఈ మమతల మంచును నేనై
ఆశలు కాచే వేసవిలో తీరని కోర్కెల తాపంలో
శివపార్వతుల సంబరమై గంగా యమునల సంగమమై
శివపార్వతుల సంబరమై గంగా యమునల సంగమమై
ఉరకలపరుగులా
పరువములోనా ప్రణయములోనా
నిలువెల్లా కరిగిపోనా నీలోనా కలిసిపోనా
నీలాల నింగిలో మేఘాల తేరులో
ఆ పాల పుంతలోనీ కౌగిలింతలో
నిలువెల్లా కరిగిపోనా నీలోనా కలిసిపోనా
నీలాల నింగిలో మేఘాల తేరులో
ఆహ హ ఆహ హఅహహ ఓహోహోహోహో మ్మ్మ్మ్
Neelaala Ningilo Meghaala Therulo Lyrics in Telugu