ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Maata Chuste Lyrics in Telugu
మాట చూస్తే మామిడల్లం
మనసు చూస్తే పటికబెల్లం
ఆ మాట చూస్తే మామిడల్లం
మనసు చూస్తే పటికబెల్లం
ఓ సొగసులాడి వెయ్యబోకే వలపు గొళ్ళేం
ఆదిలోనే అట్టహాసం
చిట్టచివరకు కాళ్ళబేరం
ఆదిలోనే అట్టహాసం
చిట్టచివరకు కాళ్ళబేరం
ఓ గడుసువాడా ఆపవయ్యా ఆర్భాటం
చరణం : 1
కస్సుమన్న పడుచుపిల్ల కన్నులవిందు
ఆ కస్సుమన్న పడుచుపిల్ల కన్నులవిందు
హేయ్ అలిగినప్పుడే
ఆడపిల్ల భలే పసందు
కయయ్మాడితేనే తమరు వియ్యమంటారు
కయయ్మాడితేనే తమరు వియ్యమంటారు
లేదా ముందుగానే ఏదేదో ఇవ్వమంటారు
ముందుగానే ఏదేదో ఇవ్వమంటారు
మాట చూస్తే మామిడల్లం
ఆ మనసు చూస్తే పటికబెల్లం
ఓ గడుసువాడా ఆపవయ్యా ఆర్భాటం
తానే తందాన తానే తందాన
తానే తందాన తానే తందాన
చరణం : 2
ఆకువక్క లేకపోతే నోరు పండదు
హా ఆకువక్క లేకపోతే నోరు పండదు
గోరువంక లేకపోతే చిలక ఉండదు
ఎండపడిన దేనికైన నీడ ఉండదా
ఎండపడిన దేనికైన నీడ ఉండదా
అహా… ఈ గుండెలోన
నీకింత చోటు ఉండదా
ఈ గుండెలోన నీకింత చోటు ఉండదా
మాట చూస్తే మామిడల్లం
ఆ మనసు చూస్తే పటికబెల్లం
Maata Chuste Lyrics in Telugu