ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Chinthaledhika Yesu Puttenu Lyrics In Telugu – Telugu Christian Songs
చింత లేదిక యేసు పుట్టెను
వింతగను బెత్లేహమందున
చెంత జేరను రండి సర్వ జనాంగమా
సంతసమొందుమా
చెంత జేరను రండి… సర్వ జనాంగమా
సంతసమొందుమా
దూత తెల్పెను గొల్లలకు
శుభవార్త నా దివసంబు వింతగా
ఖ్యాతి మీరగ వారు… యేసును గాంచిరి
స్తుతులొనరించిరి
ఖ్యాతి మీరగ వారు… యేసును గాంచిరి
స్తుతులొనరించిరి
చుక్క గనుగొని జ్ఞానులేంతో
మక్కువతో నా ప్రభుని కనుగొన
చక్కగా బేత్లేహ పురమున జొచ్చిరి
కానుకలిచ్చిరి
చక్కగా బేత్లేహ పురమున జొచ్చిరి
కానుకలిచ్చిరి
కన్య గర్భమునందు పుట్టెను
కరుణగల రక్షకుడు క్రీస్తుడు
ధన్యులగుటకు రండి… వేగమే దీనులై
సర్వ మాన్యులై
ధన్యులగుటకు రండి… వేగమే దీనులై
సర్వ మాన్యులై
పాపమెల్లను పరిహరింపను
పరమ రక్షకుడవతరించెను
దాపు జేరిన వారికిడు… కడు భాగ్యము
మోక్ష భాగ్యము
దాపు జేరిన వారికిడు… కడు భాగ్యము
మోక్ష భాగ్యము
చింత లేదిక యేసు పుట్టెను
వింతగను బెత్లేహమందున
చెంత జేరను రండి సర్వ జనాంగమా
సంతసమొందుమా
చెంత జేరను రండి… సర్వ జనాంగమా
సంతసమొందుమా
Chinthaledhika Yesu Puttenu Lyrics In Telugu – Telugu Christian Songs