Menu Close

Premalo Paddanu Lyrics In Telugu – Telugu Christian Songs

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Premalo Paddanu Lyrics In Telugu – Telugu Christian Songs

ప్రేమలో పడ్డాను నేను… ప్రేమలో పడ్డాను
నా యేసు ప్రభుని… ప్రేమలో పడ్డాను
ప్రేమలో ఉన్నాను… నేను ప్రేమలో ఉన్నాను
నా యేసు ప్రభుతో… ప్రేమలో ఉన్నాను

స్వార్ధం కలిగిన ప్రేమ కాదు… లాభం కోరే ప్రేమ కాదు
కొద్దికాలమే ఉండే ప్రేమ కాదు… అహా! శాశ్వతమైన యేసుని ప్రేమ
మోహం కలిగిన ప్రేమ కాదు… మోసం చేసే ప్రేమ కాదు
పై అందం చూసే ప్రేమ కాదు… పరిశుద్ధమయిన ప్రేమ
ఇదే కదా ప్రేమంటే… ఇదే కదా ప్రేమంటే
ఈ లోక ప్రేమ కాదు… అగాపే ప్రేమ
దేవుని ప్రేమ ఇది || ప్రేమలో పడ్డాను ||

మొదటగా ప్రపోజ్ చేసింది నేను కాదు
నా ప్రియుడే తన ప్రేమ వ్యక్తపరిచే
మొదటగా ప్రేమించింది నేను కాదు
నా యేసే తన ప్రేమ వ్యక్తపరిచే

కోరినాడు పిలిచినాడు… నేను ఏదో మంచి వ్యక్తినైనట్టు
కుమ్మరించె ప్రేమ మొత్తం… నేను తప్ప ఎవ్వరూ లేనట్టు
ఆకాశాన తనలో తాను… పరిపూర్ణునిగా ఉన్న ప్రభువుకు
భువిలో నాపై ప్రేమ ఎందుకో
ఏమి తిరిగి ఇవ్వలేని… ఈ చిన్న జీవిపైన
ప్రభువుకు అంత ప్రేమ దేనికో

హే..! ఇంత గొప్ప ప్రేమ రుచి చూశాక
నేను ప్రేమించకుండా ఎట్లా ఉంటాను
అంత గొప్ప ప్రేమ చూపు ప్రేమికునికి
ఐ లవ్ యూ చెప్పకుండా ఎట్లగుంటాను
ఇదే కదా ప్రేమంటే… ఇదే కదా ప్రేమంటే
ఈ లోక ప్రేమ కాదు… అగాపే ప్రేమ
దేవుని ప్రేమ ఇది || ప్రేమలో పడ్డాను ||

తన ప్రేమకు ఋజువు ఏంటని నేనడుగక మునుపే
నా ప్రియుడు తన ప్రేమ ఋజువుపరిచే ||2||
పాపమనే కూపమందు… నేను బందీనైయుండంగా
పాపమనే అప్పుచేత బానిసై… నేను అలసియుండంగా

గగనపు దూరము దాటివచ్చి… సిలువలో చేతులు పారచాపి
నువ్వంటే నాకింత ప్రేమనే
రక్తముతో నను సంపాదించి… నా కళ్ళల్లో కళ్ళు పెట్టి
నీపై పిచ్చి ప్రేమ నాకనే
హే…! నన్ను తన సొత్తు చేసుకున్నాడు
నా పాప కట్లు తెంపి స్వేచ్ఛనిచ్చాడు
మరల వచ్చి పెళ్ళి చేసుకుంటాను
అని నిశ్చితార్ధం చేసుకొని వెళ్ళాడు
ఇదే కదా ప్రేమంటే… ఇదే కదా ప్రేమంటే
ఈ లోక ప్రేమ కాదు… అగాపే ప్రేమ
దేవుని ప్రేమ ఇది || ప్రేమలో పడ్డాను ||

ప్రేమతో నా ప్రియుడు వ్రాసెను ప్రేమలేఖ
వాక్యమనే పరిశుద్ధ ప్రేమలేఖ ||2||
ఆ లేఖ చదువుతుంటే… నా ప్రియుని తలపులే నాలో నిండే
ప్రభుని ప్రేమ లోతు తెలిసి… నా యేసుపై ప్రేమ పొంగి పొరిలే
రేయింబగలు ప్రభు కావాలని… తనతో ఎప్పుడు కలిసుండాలని
నా ప్రాణము పరితపియించెనే
యుగయుగములు నన్నేలెడి వాడు… అతి త్వరలోనే రానున్నాడని
ఆత్మలో కలిగే ప్రేమ పరవశమే

హే…! వింతయైన నా యేసు ప్రేమ గూర్చి
నేను సర్వలోకమునకు చాటి చెపుతాను
యేసు రక్తమందు శుద్ధులైన వారే
ఆ ప్రేమ రాజ్యమందు ఉందురంటాను
ఇదే కదా ప్రేమంటే… ఇదే కదా ప్రేమంటే
ఈ లోక ప్రేమ కాదు… అగాపే ప్రేమ
దేవుని ప్రేమ ఇది || ప్రేమలో పడ్డాను ||

Premalo Paddanu Lyrics In Telugu – Telugu Christian Songs

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading