Menu Close

Ye Papamerugani Lyrics In Telugu – Telugu Christian Songs

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Ye Papamerugani Lyrics In Telugu – Telugu Christian Songs

ఏ పాప మెరుగని ఓ పావనమూర్తి పాప విమోచకుండ
నా పాలి దైవమా నా పాపముల కొరకీ పాట్లు నొందినావా

ముళ్ళతో కిరీటమల్లి నీ శిరముపై… జల్లాటమున మొత్తిరా
ముళ్ళ పోట్లకు శిరము తల్లడిల్లగ… సొమ్మసిల్లిపోతివ రక్షకా
ఏ పాప మెరుగని ఓ పావనమూర్తి పాప విమోచకుండ
నా పాలి దైవమా నా పాపముల కొరకీ పాట్లు నొందినావా

కలువరి గిరి దనుక సిలువ మోయలేక… కలవరము నొందినావా
సిలువ నీతో మోయతులువలు వేరొకని తోడుగా నిచ్చినారా
ఏ పాప మెరుగని ఓ పావనమూర్తి పాప విమోచకుండ
నా పాలి దైవమా నా పాపముల కొరకీ పాట్లు నొందినావా

చెడుగు యూదులుబెట్టు పడరాని పాట్లకు… సుడివడి నడచినావా
కడకు కల్వరి గిరి కడ కేగి… సిల్వను గ్రక్కున దించినావా
ఏ పాప మెరుగని ఓ పావనమూర్తి పాప విమోచకుండ
నా పాలి దైవమా నా పాపముల కొరకీ పాట్లు నొందినావా

ఆ కాల కర్ములు భీకరంబుగ… నిన్ను ఆ కొయ్యపై నుంచిరా
నీ కాలు సేతులు ఆ కొయ్యకే… సూది మేకులతో గ్రుచ్చినారా
ఏ పాప మెరుగని ఓ పావనమూర్తి పాప విమోచకుండ
నా పాలి దైవమా నా పాపముల కొరకీ పాట్లు నొందినావా

పలువిధంబుల శ్రమలు చెలరేగ… దండ్రికి నెలుగెత్తి మొరలిడితివా
సిలువపై పలుమారు కలుగుచుండెడి… బాధ వలన దాహము నాయెనా
ఏ పాప మెరుగని ఓ పావనమూర్తి పాప విమోచకుండ
నా పాలి దైవమా నా పాపముల కొరకీ పాట్లు నొందినావా

బల్లిదుండగు బంటు బల్లెమున… నీ ప్రక్క జిల్లి బడ బొడచినాడా
ఉల్లోలములవలె నల్ల నీరుబుకంగ జల్లారె గద కోపము
ఏ పాప మెరుగని ఓ పావనమూర్తి పాప విమోచకుండ
నా పాలి దైవమా నా పాపముల కొరకీ పాట్లు నొందినావా

కటకటా పాప సంకటము బాపుట… కింత పటు బాధ నొందినావా
ఎటువంటిదీ ప్రేమ యెటువంటిదీ శాంత మెటుల వర్ణింతు స్వామి
ఏ పాప మెరుగని ఓ పావనమూర్తి పాప విమోచకుండ
నా పాలి దైవమా నా పాపముల కొరకీ పాట్లు నొందినావా

Ye Papamerugani Lyrics In Telugu – Telugu Christian Songs

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading