ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Nee Dayalo Nenunna Lyrics In Telugu – Telugu Christian Songs
నీ దయలో నేనున్న ఇంత కాలం
నీ కృపలో దాచినావు గత కాలం
నీ దయలో నేనున్న ఇంత కాలం
నీ కృపలో దాచినావు గత కాలం
నీ దయ లేనిదే… నేనేమౌదునో
నీ దయ లేనిదే… నేనేమౌదునో తెలియదయ్యా
నీ దయలో నేనున్న ఇంత కాలం
నీ కృపలో దాచినావు గత కాలం
తల్లిదండ్రులు చూపిస్తారు… ఎనలేని ప్రేమను ఇలలో
చేయాలని ఆశిస్తారు… అందనంత గొప్పవారిగా ||2||
నీ దయ ఉంటే వారు… కాగలరు అధిపతులుగా
నీ దయ లేకపోతే ఇలలో… బ్రతుకుట జరుగునా
నీ సిలువ నీడలోనే… నను దాచియుంచావని
నా శేష జీవితాన్ని… నీతోనే గడపాలని
నీ దయలో నేనున్న ఇంత కాలం
నీ కృపలో దాచినావు గత కాలం
నేల రాలే నా ప్రాణాన్ని లేపి… నన్ను నిలిపావు
అపవాది కోరలకు… అంటకుండ దాచావు ||2||
నీ రెక్కల నీడలో… నాకాశ్రయ దుర్గము
ఏ కీడు నా దారికి రాకుండ… నీ కృపను తోడుంచినావు
నీ పాదాల చెంతనే… నే పరవశించాలని
నా ఆయువున్నంత వరకు… నీ ప్రేమ పొందాలని
నీ దయలో నేనున్న ఇంత కాలం
నీ కృపలో దాచినావు గత కాలం
నీ దయ లేనిదే… నేనేమౌదునో తెలియదయ్యా
నీ దయలో నేనున్న ఇంత కాలం
నీ కృపలో దాచినావు గత కాలం
Nee Dayalo Nenunna Lyrics In Telugu – Telugu Christian Songs