ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Entho Vintha Entho Chintha Lyrics In Telugu – Telugu Christian Songs
ఎంతో వింత ఎంతో చింత… యేసునాధు మరణమంత
పంతముతో జేసిరంత… సొంత ప్రజలు, స్వామినంత
ఎంతో వింత, ఎంతో చింత… యేసునాధు మరణమంత
పట్టి కట్టి నెట్టి కొట్టి… తిట్టి రేసు నాధునకటా
అట్టి శ్రమలనొంది పలుకడాయె… యేసు స్వామి నాడు
ఎంతో వింత, ఎంతో చింత… యేసునాధు మరణమంత
మొయ్యలేని మ్రానునొకటి… మోపిరేసు వీపు పైని
మొయ్యలేని మ్రానునొకటి… మోపిరేసు వీపు పైని
మొయ్యలేక మ్రానితోడ… మూర్చబోయే నేసు తండ్రి
ఎంతో వింత, ఎంతో చింత… యేసునాధు మరణమంత
కొయ్యపై నేసయ్యన్ బెట్టి… కాలు సేతులలో జీలల్
కఠినులంత గూడి కొట్టిరి… ఘోరముగ క్రీస్తేసున్ బట్టి
ఎంతో వింత, ఎంతో చింత… యేసునాధు మరణమంత
దాహము గొన చేదుచిరక… ద్రావ నిడిరి ద్రోహులకటా
ధాత్రి ప్రజల బాధకోర్చి… ధన్యుడా దివికేగె నహహా
ఎంతో వింత, ఎంతో చింత… యేసునాధు మరణమంత
బల్లెముతో బ్రక్కన్ బొడవన్… పారే నీరు రక్తమహహా
ఏరై పారే యేసు రక్త మెల్ల… ప్రజల కెలమి నొసగు
ఎంతో వింత, ఎంతో చింత… యేసునాధు మరణమంత