
ఆత్మవంచన, పరనింద చేసేవారు
తమ పతనాన్ని తాము కొని తెచ్చుకున్నట్లే
మితిమీరిన ఓర్పు పిరికితనం అవుతుంది
భయం వలన ఉపయోగం వుంది
కాని పిరికితనం వల్ల కాదు
సేవ ధర్మం, ప్రేమ భావం
ఎక్కడబడితే అక్కడ పుట్టుకురావటానికి
పుట్టగొడుగులేం కాదు,
అవి లోపల నుంచి పొంగుకు రావాలి,
అందుకు సాధన అవసరం
ఎలా ఆలోచించాలి అని తెలిసిన వారికి
ఉపాధ్యాయులు అవసరం లేదు