Menu Close

Andagada Andagada Lyrics In Telugu – Gharshana

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Andagada Andagada Lyrics In Telugu – Gharshana

అందగాడా అందగాడా… అందాలన్నీ అందుకోరా
అల్లుకోరా గిల్లుకోరా… అందమంతా నీదిరా
మల్లెమొగ్గా మల్లెమొగ్గా… రమ్మంటోందోయ్ అందగాడా
పూలపక్కా ఆకువక్కా… అందుకోరా సుందరా

గోదారల్లే నాలో పొంగే కోరికమ్మా
నీదేలేరా నోరూరించే ఆడబొమ్మా
ఆడుకోరా పాడుకోరా… రాతిరంతా హాయిగా
అందగాడా అందగాడా… అందాలన్నీ అందుకోరా
అల్లుకోరా గిల్లుకోరా… అందమంతా నీదిరా

గాలే తాకనీ నాలో సోకునీ… ఇన్నాళ్ళుంచానయ్యో నీకోసం
నా అందం చందం అంతా నీ కోసం
తోడే లేదనీ కాలే కౌగిలీ… ఎప్పటి నుంచీ ఉందో నీకోసం
నా ప్రాయం ప్రాణం అంతా నీ కోసం
ఎందుకో ఏమిటో… ఇంతకాలం ఎంతో దూరం
ముందరే ఉందిగా… సొంతమయ్యే సంతోషం
అందగాడా అందగాడా అందాలన్నీ అందుకోరా
అల్లుకోరా గిల్లుకోరా అందమంతా నీదిరా

జారే పైటకీ తూలే మాటకీ… తాపం పెంచిందయ్యో నీరూపం
ఏనాడు లేనే లేదు ఈ మైకం
నాలో శ్వాసకీ రేగే ఆశకీ… దాహం పెంచిందయ్యో నీ స్నేహం
గుర్తంటూ రానేరాదు ఈ లోకం
నీ జతే చేరితే మాయమయ్యే నాలో మౌనం
రాగమై సాగెనే అంతులేని ఆనందం

మల్లెమొగ్గా మల్లెమొగ్గా… రమ్మంటోందోయ్ అందగాడా
పూలపక్కా ఆకువక్కా… అందుకోరా సుందరా
గోదారల్లే నాలో పొంగే కోరికమ్మా
నీదేలేరా నోరూరించే ఆడబొమ్మా
ఆడుకోరా పాడుకోరా… రాతిరంతా హాయిగా

Like and Share
+1
2
+1
6
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading