Menu Close

ఏడు వారాల నగలు – 7 Varala Nagalu Explained

ఏడు వారాల నగలు అని వినడమే గాని వాటి గురించి ఏమైనా తెలుసా..?

7 Varala Nagalu” is a traditional Telugu cultural practice symbolizing prosperity and protection. This detailed explanation delves into its significance, rituals, and the spiritual meaning behind each varam.

ఏడు వారాల నగలు.. ఈ పేరులో ఉన్నట్లే వారంలో ఉండే ఏడు రోజుల్లో ఒక్కో రోజు వేసుకునే నగలు అన్నమాట. వారాన్ని బట్టి, గ్రహాన్ని బట్టి ఈ నగలు ఉంటాయి. ఇప్పుడు రాశులను బట్టి, జాతకాన్ని బట్టి రత్నాలున్న ఉంగరాల్ని పెట్టుకుంటున్నాం. ఫలానా దోషం ఉంటే కొన్ని రకాల రత్నాలు ఉన్న నగలు పెట్టుకోమని సూచిస్తున్నారు. కానీ ఈ సాంప్రదాయం పాతకాలం నాటిదే.

వారంలో ఒక్కో రోజుకు ఒక అధిపతి ఉంటారు. దానికి తగ్గట్లుగా నగలు వేసుకుంటే స్త్రీలకు ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఉంటాయని నమ్మేవారు. దాని ప్రకారమే ఏ వారానికి తగ్గట్లు ఆ రోజకు వివిధ రంగుల్లో ఉంటే స్టోన్స్ ఉంచి వీటిని తయారు చేయించుకునే వాళ్లు.

7 Varala Nagalu Explained

ఏ రోజుకు ఏ నగలు? వారంలో ఏడు రోజులు ఏ రోజు ఏ నగలు వేసుకుంటారో చూడండి.

ఆదివారానికి అధిపతి సూర్యుడు. ఆయనకు ఇష్టమైన రంగు ఎరుపు. దానికోసం ఎరుపు రంగులో ఉండే కెంపులతో పొదిగిన చెవిపోగులు, హారాలు, ఉంగరాలు ఉంటాయి.

సోమవారం చంద్రునికి సంబంధించింది. ఈ రోజు ముత్యాలతో చేసిన నగలు వేసుకోవడం శుభప్రదం. అంటే ముత్యాలతో చేసిన హారాలు, ముత్యాలు పొదిగిన గాజులు, ఉంగరం లాంటివి. ముత్యాలు తెలుపు రంగులో ఉంటాయని తెల్సిందే.

మంగళవారం కుజుడిది. ఈ రోజుకు పగడాలు ఒదిగిన ఉంగరాలు, దండలు ధరించొచ్చు. పగడాలని కోరల్స్ అంటారు. ఇవి చూడ్డానికి ఆరెంజ్ రంగులో ఉంటాయి.

బుధవారం బుధ గ్రహానికి సంబంధించిన పచ్చల నగలుంటాయి. పచ్చలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. వీటినే ఎమరాల్డ్స్ అనీ అంటారు. ఇవి పొదిగిన గాజులు, ఉంగరం లాంటి నగలు బుధవారం ధరిస్తారు.

గురువారం గురుడు లేదా బృహస్పతిది. కనక పుష్యరాగంతో చేసిన ఉంగరాలు, కమ్మలు ఈ రోజు ధరిస్తారు. ఇది పసుపు రంగులో ఉంటుంది.

శుక్రవారం శుక్ర గ్రహం కోసం వజ్రాల నగలు ధరించాలి. ముక్కుపుడక, పెండెట్లు, హారాలు, చెవి దిద్దులు ధరించొచ్చు.

శనివారం శని గ్రహానిది. శని అనగానే నలుపు రంగు అనిపిస్తుంది కానీ కాదు. ఈ రోజు నీలమణితో చేసిన నగలు వేసుకుంటారు. నీలం రంగు స్టోన్ ఉన్న ఉంగరం పెట్టుకోవచ్చు.

7 Varala Nagalu significance in Telugu culture
7 Varala Nagalu rituals and meaning
Detailed explanation of 7 Varala Nagalu
Spiritual importance of 7 Varala Nagalu
Traditional Telugu 7 Varala Nagalu practice
How to perform 7 Varala Nagalu rituals
7 Varala Nagalu for prosperity and protection
7 Varala Nagalu Telugu customs explained
7 Varala Nagalu step-by-step guide
Understanding 7 Varala Nagalu in Telugu households

7 Varala Nagalu, Telugu traditions, prosperity rituals, cultural practices, spiritual significance, Telugu customs, traditional rituals, varam significance, Telugu festivals, protection rituals.

Subscribe to Our YouTube Channel

Like and Share
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading