ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
29-11-2024 – ఈ వారం OTT లోకి అదిరిపోయే సినిమాలు
ఏం చూడాలబ్బా అని మీరు వెతికే పని లేకుండా మీకోసం ఈ వారం ఒటిటి లో రిలీజ్ అయిన ఐదు సినిమాలను మేమే వెతికి తీసుకుకొచ్చాం.ఈ ఐదు సినిమాలు వీకెండ్ మీరు ఫ్యామిలీ తో కలిసి చూసి ఎంజాయ్ చేయడానికి సినిమాలు ఇవిగోండి..
Must Watch Movies in Telugu This Weekend
క: కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన క సినిమా ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది. అక్టోబర్ 31 న రిలీజ్ అయిన సినిమా పాజిటివ్ టాక్ తో మంచి వసూళ్లను రాబట్టింది. కిరణ్ అబ్బవరం కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాని సుజీత్ సందీప్ అనే అన్నా తమ్ముళ్లు డైరెక్ట్ చేశారన్న విషయం తెలుసా మీకు.!!
లక్కీ భాస్కర్: దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా… ప్రేక్షకుల దగ్గర నుండి విమర్శకుల వరకు అందరి ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా ఈ రోజు నుండి నెటిఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ తో పాటు హిందీ లో కూడా ఈ సినిమా నెటిఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.
అప్పుడో ఇప్పుడో ఎప్పుడో: నిఖిల్ సుధీర్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన మూడవ సినిమా అప్పుడో ఇప్పుడో ఎప్పుడో . సప్త సాగరాలు దాటి ఫేమ్ రుక్మిణి వసంత్ , దివ్యాంశ కౌశిక్ హీరోయిన్లు గా నటించిన ఈ సినిమా కి సన్నీ ఎం.ఆర్ సంగీతం అందించాడు . ఈ రొమాంటిక్ థ్రిల్లర్ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది.
బ్లడీ బెగ్గర్: తమిళ బిగ్ బాస్ ఫేమ్ కవిన్ హీరోగా, డాక్టర్,బీస్ట్, జైలర్ చిత్రాల దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ నిర్మించిన చిత్రం బ్లడ్డీ బెగ్గర్. ఈ కామెడీ డ్రామా థియేటర్ లో రిలీజ్ అయినప్పుడు ప్రేక్షకులను కితకితలు పెట్టించింది. ఈ సినిమా శుక్రవారం నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవ్వనుంది.
సికందర్ కా ముఖద్దర్: తమన్నా భాటియా, జిమ్మీ షేర్గిల్ ముఖ్య పాత్రలలో నటించిన చిత్రం సికందర్ కా ముఖద్దర్. నీరజ్ పాండే ఈ చిత్రానికి దర్శకుడు. ఈ థ్రిల్లర్ సినిమా 29 నవంబర్ న నెటిఫ్లిక్స్ లో విడుదల కానుంది.